మొక్కలతో ..మొక్కవోని ఆత్మవిశ్వాసం పుట్టిన రోజు వేడుక

డైలాగ్ కింగ్ పద్మశ్రీ డాక్టర్‌ మోహన్‌బాబు  జన్మదిన వేడుకలను తిరుపతిలోని తన శ్రీ విద్యా నికేతనలో  ఈ రోజు తన 68 వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచ అభిమానులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మోహన్ బాబు కుటుంబ సభ్యులుతో పాటు ఆయన శ్రేయాభిలాషులు అయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త , శాంతా బయోటిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ వంటి ప్రముఖులు పాలుపంచుకున్నారు. తిరుపతి సమీపంలోని రంగంపేట శ్రీవిద్యానికేతన్‌కు ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.
అయితే ఈ పుట్టిన రోజుకి ఓ ప్రత్యేక ఉంది. త‌న పుట్టిన రోజైన మొక్క‌ల‌తో రావాల‌ని త‌న అభిమానుల‌కు పిలుపు ఇచ్చారు మోహ‌న్ బాబు . పుష్పగుచ్ఛాలు, పూల మాలలు తన కోసం తీసుకురావొద్దని కోరారు. తనకు ఏవైనా కానుకలు ఇవ్వదలచుకుంటే పుష్పాలకు బదులుగా మొక్కలను తీసుకురావాలని సూచించారు. ఈ కానుక తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
అంతేకాదు…ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజును తిరుపతిలో తాను నెలకొల్పిన విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది శ్రేయోభిలాషుల నుంచి పెద్ద సంఖ్యలో బొకేలు, బహుమతులు అందుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం అలాంటి బహుమతులేవి తీసుకురావద్దని ప్రకటించారు మోహన్ బాబు. 
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇలా వృథా ఖర్చులు చేయొద్దని కోరిన ఆయన ఆ మొత్తాన్ని మిరాకిల్ అనే స్వచ్ఛంద సంస్థకు అందించాలని కోరారు. దాదాపు 3000 మంది అనాథ బాలలను సంరక్షిస్తున్న ఈ సంస్థను ఇటీవల సందర్శించిన మోహన్ బాబు, ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 విద్యానికేతన్ విద్యాసంస్థలు 41వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా రెండురోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు మోహన్ బాబు చెప్పారు. తొలిరోజు కార్యక్రమాలకు హీరో వెంకటేష్ హాజరవుతారని ఆయన తెలిపారు. మనతో పాటు, మనపక్కన వాళ్లు కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు. 
నటనలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఒక ఒరవడి క్రియేట్ చేసి, దాన్ని కంటిన్యూ చేసి… అలసట అనేది లేకుండా ఇప్పటికీ వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్న   మోహన్ బాబుకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో ,మరెన్నో పుట్టిన రోజులు ఆయన జరుపుకోవాలని తెలుగు 100 ఆశిస్తోంది.