ఆడపిల్ల పుట్టిన ప్రతీ సారి అక్కడ 111 మొక్కలు నాటుతారు

ఇప్పటికి ఆడపిల్ల పుడితే చాలు అన్నీ బాధలు అనుకునే సమాజంలో ఉన్నాం మనం. ఆడపిల్లలు పుడితే చెత్త బుట్టల్లో వార్తలు ఇప్పటికీ కనపడుతూంటాయి. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.  అక్కడ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అక్కువ చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు. అంతేకాదు అక్కడ ఆడపిల్ల పుట్టిన ప్రతీ సారి తమ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు. అలా నాటిన మొక్కని కన్న బిడ్డలా చూసుకుంటారు. ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టింది రాజస్దాన్ లోని పిప్లాన్ ట్రీ అనే గ్రామం. ఇటు స్త్రీ నిష్పత్తిని పెంచుతూ..అటు పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు సదరు గ్రామస్దులు. ఇంత గొప్ప ఆచారాన్ని గత 11 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు.